డ్రగ్స్ కోసం నిల్వ కేంద్రాలు | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కోసం నిల్వ కేంద్రాలు

Published Fri, Jan 29 2016 2:20 AM

డ్రగ్స్ కోసం నిల్వ కేంద్రాలు - Sakshi

న్యూఢిల్లీ: సంఘ వ్యతిరేక శక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న కొకెయిన్, హెరాయిన్ తదితర అన్ని రకాల నిషేధిత డ్రగ్స్‌ను ప్రత్యేకంగా భద్రపరిచేందుకు సురక్షిత నిలువ కేంద్రాలను ఆరునెలల్లోగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది.  డ్రగ్స్ మాఫియా మూలాలు చాలా లోతుల్లో ఉన్నాయని, అవి దేశాంతరాలకు విస్తరించాయని, వారి వద్ద డబ్బుతో పాటు పోలీసులు, రాజకీయ నేతల అండదండలు  ఉన్నాయని, పెద్ద మొత్తంలో అక్రమ సంపాదనకు మార్గమైన డ్రగ్స్ బిజినెస్‌కు అధికారంలో ఉన్న రాజకీయ వర్గాలు సహకరించడం సాధారణమేనని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోందని పేర్కొంది.

‘2002-2012 మధ్య స్వాధీనం చేసుకున్న నిషేధిత డ్రగ్స్‌లో కేవలం 16% డ్రగ్స్‌నే నాశనం చేసినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement