మోదీ.. మీ ప్రతాపం ఇంతేనా? | Sakshi
Sakshi News home page

మోదీ.. మీ ప్రతాపం ఇంతేనా?

Published Sun, Oct 12 2014 12:42 AM

మోదీ.. మీ ప్రతాపం ఇంతేనా? - Sakshi

సిర్సా(హర్యానా): సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.  చైనా చొరబాట్లపైనా  నిలదీశారు. చైనా చొరబాట్ల అంశాన్ని చైనా అధ్యక్షుడి ముందు కూడా ప్రధాని ప్రస్తావించలేదన్నారు. పాక్‌ను మన జవాన్లు నోరుమూయించారని, సరిహద్దులో పరిస్థితి మామాలు స్థితికి చేరుకుంటోందని మోదీ హామీ ఇచ్చిన మరుసటిరోజునే ఆయనపై రాహుల్ విమర్శలు పెంచారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఫిరోజ్‌పూర్ జిర్కా, రేవారీ, గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించారు.  ప్రధానినైతే తాను పాకిస్థాన్, చైనాలను కట్టడిచేస్తానంటూ మోదీ హామీ ఇచ్చారని, అయినా సరిహద్దులో కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, జనం చనిపోతూ ఉన్నారని రాహుల్ అన్నారు. ‘సరిహద్దులో మామూలు పరిస్థితులు ఏర్పడుతాయని కొన్ని రోజుల కిందట చెప్పారు.

 

కాల్పులు పూర్తిగా ఆగిపోయాయంటూ శుక్రవారం చెప్పారు. ఈ రోజు (శ నివారం) మళ్లీ కాల్పులు మెుదలయ్యాయి.’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ బహిరంగ సభ జరిగిన కొన్నిగంటలకే సిర్సాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

Advertisement
Advertisement