ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్ | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్

Published Mon, Jul 27 2015 12:05 PM

Rahul Gandhi condemns Punjab terror attack

న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తుననట్టు రాహుల్ ట్విట్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పంజాబ్ లో సాధ్యమైనంత తొందరగా పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పిరికతనంతో అమాయకులపై  ఉగ్రవాదులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే అపరాధులైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు కేజ్రీవాల్  ట్విట్ చేశారు.

కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్  పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement