Sakshi News home page

అభివృద్ధికి పట్టం కట్టండి: రాహుల్

Published Mon, Oct 28 2013 1:58 AM

Rahul Gandhi hardsells Delhi's development, food security

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్‌ను నాలుగోసారి గెలిపిం చి, అభివృద్ధికి పట్టం కట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గత కొంతకాలంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విరుచుకుపడుతున్న రాహుల్ ఈ సభలో మాత్రం ప్రత్యర్థులపై ఎలాంటి విమర్శలు చేయకుండా అభివృద్ధి మంత్రం పఠించారు.అభివృద్ధికి పెద్దపీట వేస్తూ షీలాదీక్షిత్ ఢిల్లీ ముఖచిత్రాన్నే మార్చి వేశారని కొనియాడారు.

 

ఉపాధి కోసం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడినవారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. సామాన్యుడి చేతికి అధికారం వచ్చినప్పుడే దేశం శక్తిమంతం అవుతుందని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు కూడా చట్టసభల్లో ప్రవేశించాలని కోరుకుంటున్నామని, అయితే అందుకు బీజేపీ వ్యతిరేకమని దుయ్యబట్టారు. ఆమ్ ఆద్మీ చేతిలో అధికారాన్ని పెట్టేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, అందులో భాగంగానే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చామని వివరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement