పాదయాత్రకు వెళ్లనున్న రాహుల్! | Sakshi
Sakshi News home page

పాదయాత్రకు వెళ్లనున్న రాహుల్!

Published Tue, Apr 21 2015 6:50 PM

పాదయాత్రకు వెళ్లనున్న రాహుల్!

దాదాపు రెండు నెలల సుదీర్ఘ విశ్రాంతి తీసుకుని మళ్లీ తిరిగొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. త్వరలోనే పాదయాత్రకు బయల్దేరనున్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పాదయాత్ర చేసి, వర్షాభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోడానికి ఆయన వెళ్తారని అంటున్నారు. అలాగే, శుక్రవారం నాడు ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం అమేథీకి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఈమధ్య కాలంలో రాహుల్ కనిపించడం లేదంటూ అక్కడ పోస్టర్లు కూడా వెలిశాయి. కాగా, రాహుల్ గాంధీ కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ను రూపొందించారు. త్వరలో రాహుల్ను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నందున దానికి ముందే ఆయన ఇమేజ్ని పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement