మూడోసారి సీఎంగా రమణ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం | Sakshi
Sakshi News home page

మూడోసారి సీఎంగా రమణ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం

Published Thu, Dec 12 2013 12:24 PM

మూడోసారి సీఎంగా రమణ్‌సింగ్‌  ప్రమాణస్వీకారం - Sakshi

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్సింగ్ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్పై విజయం సాధించిన ఆయన సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టారు. రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి  బీజేపీ ప్రముఖ నేతలు ఎల్‌కే అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి,నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, శివరాజ్‌చౌహాన్, గోవా ముఖ్యమంత్రి పారికర్ హాజరయ్యారు. కాగా రాష్ట్ర కేబినెట్ మరో వారంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement