రేప్ బాధితురాలికి అబార్షన్ నిరాకరణ | Sakshi
Sakshi News home page

రేప్ బాధితురాలికి అబార్షన్ నిరాకరణ

Published Wed, Aug 20 2014 4:37 PM

రేప్ బాధితురాలికి అబార్షన్ నిరాకరణ - Sakshi

లండన్: ఐర్లాండ్ లో అబార్షన్ పై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అత్యాచారానికి గురైన విదేశీ యువతికి అబార్షన్ చేసేందుకు ఐర్లాండ్ వైద్యులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఐర్లాండ్ చట్టాలపై దుమారం రేగింది. ఐర్లాండ్ రావడానికి ముందు బాధిత విదేశీ యువతి అత్యాచారానికి గురైంది. ఆమె గర్భం దాల్చినట్టు ఇక్కడికి వచ్చాక వైద్య పరీక్షల్లో తెలిసింది.

రేపిస్టు బిడ్డకు జన్మనిచ్చే కంటే అబార్షన్ చేయించుకోవాలని ఆమె నిర్ణయించింది. అయితే ఆమెకు అబార్షన్ చేసేందుకు ఐర్లాండ్ వైద్యులు నిరాకరించారు. గ్రేట్ బ్రిటన్ కు  వెళ్లి అబార్షన్ చేయించుకోవాలని, ఇందుకయ్యే ఖర్చు తామే భరిస్తామని ఉచిత సలహాయిచ్చారు. దీంతో కలతచెందిన బాధితురాలు ఆత్మహత్యాతయ్నం చేసింది.

2012లో భారతీయ దంత వైద్యురాలు సవితా హలపన్వర్ కు అబార్షన్ నిరాకరించడంతో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గర్భస్రావ నిరోధక చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని ఐర్లాండ్ నిర్ణయించింది. ఈ బిల్లుకు ఐర్లాండ్ చట్టసభ సభ్యుల నుంచి ఆదిలోనే అడ్డంకులు ఎదురవడంతో కార్యరూపం దాల్చలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement