అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య

Published Wed, Sep 18 2013 11:12 AM

Rape victim commits suicide in Jharkhand

జార్ఖండ్లో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక అత్మహత్య చేసుకుంది.  కోడెర్మా జిల్లాలోని జయనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

వారం రోజుల క్రితం ఈ బాలిక అత్యాచారానికి గురయింది. ఈ నెల 11న పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలికను 24 ఏళ్ల యువకుడు బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడని కేసు నమోదయింది. నిందితుడిని తర్వాత రోజు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement