ఆలయాల్లోని బంగారంపై రిజర్వ్ బ్యాంక్ ఆరా! | Sakshi
Sakshi News home page

ఆలయాల్లోని బంగారంపై రిజర్వ్ బ్యాంక్ ఆరా!

Published Fri, Sep 6 2013 2:19 AM

ఆలయాల్లోని బంగారంపై రిజర్వ్ బ్యాంక్ ఆరా!

తిరువనంతపురం: మీ దగ్గర ఎంతెంత బంగారం ఉందో చెప్పండంటూ కేరళలోని దేవస్థానాలకు రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసింది. బంగారం నిల్వల గురించి వాకబు చేస్తూ దేవాలయాలకు లేఖలు రాసిన మాట నిజమేనని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ సంచాలకుడు సలీం గంగాధరన్  నిర్ధారించారు. అయితే, సమాచారం కోసం మాత్రమే బంగారం వివరాలు అడుగుతున్నామని, కొనే ఉద్దేశమేదీ లేదన్నారు. తిరువనంతపురంలోని సుప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో రూ. లక్ష కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు 2011 జూలైలో సుప్రీంకోర్టు ప్రతినిధులు లెక్కతేల్చిన విషయం తెలిసిందే. కేరళలోని ఆలయాలను ఐదు బోర్డులు పర్యవేక్షిస్తున్నాయి. ప్రఖ్యాత శబరిమల ఆలయం ట్రావన్‌కోర్ బోర్డు పరిధిలోకి వస్తుంది. 
 

Advertisement
Advertisement