రైల్వే షేర్లకు ఆర్‌డీఏ కిక్‌ | Sakshi
Sakshi News home page

రైల్వే షేర్లకు ఆర్‌డీఏ కిక్‌

Published Thu, Apr 6 2017 11:22 AM

రైల్వే షేర్లకు ఆర్‌డీఏ కిక్‌

న్యూఢిల్లీ: రైల్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం  రైల్‌ షేర్లకు కిక్‌ ఇచ్చింది.   రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌డీఏ)ఏర్పాటుకు  క్యాబినెట్‌ బుధవారం  సాయంత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  తద్వారా  రైల్వే శాఖలో సంస్కరణలకు మోదీ సర్కారు శ్రీకారం  చుట్టింది.  రూ.50కోట్ల నిధులతో ఈ  బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు  ప్రకటించింది.   దీంతో మార్కెట్లో  రైల్‌ సెక్టార్‌ దూసుకుపోతోంది.   ప్రధానంగా  స్టోన్‌ ఇండియా 14 శాతం  కెర్నెక్స్‌ మైక్రో 5 శాతం జంప్ చేశాయి. ఈ బాటలో  పయనిస్తున్న టెక్స్‌మాకో రైల్‌ 2.2 శాతం, బీఈఎంఎల్‌ 1.6 శాతం , టిటాగర్‌వేగన్‌  స్వల్పంగా చ బలపడ్డాయి.

 ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అతిపెద్ద సంస్కరణఅని  ఎనలిస్టులు భావిస్తున్నారు.  ఈ సంస్థ 1989 నాటి రైల్వే చట్టం పరిధిలోనే పనిచేస్తుంది. దీని ఏర్పాటుకు రూ. 50 కోట్ల నిధులు కేటాయించారు.  ప్రత్యేక బడ్జెట్‌ తో స్వతంత్ర సంస్థగా ఈ బోర్డు పనిచేయనుంది.  1980 రైల్వేచట్టం ప్రకారం  పని చేస్తుంది. ఇందులో చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీళ్ల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. మరోవైపు చాలా కాలంగా పెండింగులో ఉన్న రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన  నేపథ్యంలో రాబోయే కొన్ని నెలల్లో రైలు టికెట్ల ధరలు బాగానే పెరగనున్నాయనే అంచనాలను నెలకొన్నాయి.


 

Advertisement
Advertisement