ఆ మహిళలకు రెడ్వైన్ భలే మందట | Sakshi
Sakshi News home page

ఆ మహిళలకు రెడ్వైన్ భలే మందట

Published Sat, Oct 22 2016 1:58 PM

ఆ మహిళలకు రెడ్వైన్  భలే మందట

పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) తో బాధపడే మహిళలకు  రెడ్ వైన్ దివ్య ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనం తేల్చింది.రెడ్ వైన్, ద్రాక్ష లలో ఉండే ఒక సహజ సమ్మేళనం  హార్మోన్ అసమతుల్యత తో ఇబ్బందులుపడే  స్త్రీలకు  సహాయపడుతుందని తేల్చారు..సాధారణంగా   గింజల్లో (నట్స్) కనిపించే,  వ్యాధులనుంచి గుండెను కాపాడే యాంటీ ఆక్సిడెంట్... రెస్వెట్రాల్ సప్లిమెంట్  ను  రెడ్ వైన్ లో కనుగొన్నట్టు  తెలిపారు. ఈ అధ్యయనాన్ని  ఎండోక్రైన్ సొసైటీ  జర్నల్ 'క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' లో ప్రచురించింది.
 వైద్యశాస్త్రం  ప్రకారం పురుషుల్లో ఎక్కువగా, మహిళల్లో  తక్కువగాను ఉండే  టెస్టోస్టెరాన్  హార్మోన్  స్థాయిఎక్కువ  మోతాదులో మహిళల్లో ఉత్పత్తికావడం మూలంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వంధ్యత్వం, బరువు పెరగడం. మొటిమలు, అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్, లాంటి సమస్యలు తలెత్తుతాయి.  అంతేకాదు ఈ  పునరుత్పత్తి హార్మోను టెస్టోస్టెరాన్ మహిళల్లో మధుమేహ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 కాలిఫోర్నియా, శాన్ డియాగో, విశ్వవిద్యాలయ పరిశోధకులు రెడ్ వైన్ లోని (వేరుశెనగ, బ్లాక్ బెర్రీస్ , చాక్లెట్లలో లభించే) రెస్వెట్రాల్ అనే పాలీఫినాల్  తో   30 మంది మహిళలపై మూడు  నెలలపాటు  పరిశోధించారు. ఈ  క్రమంలో వారిలోని  హార్మోన్ స్థాయిలు సరి చేయగలిగినట్టు చెప్పారు.   దాదాపు  23.1 శాతం టెస్టోస్టిరాన్  స్థాయి తగ్గినట్టు గుర్తించారు. రెస్వెట్రాల్..  ఇన్సులిన్ నియంత్రణకు ,   మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందనీ,  శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని తమ   పరిశోధనలో తేలిందని  కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఎండీ, సీనియర్ రచయిత,  అంటోని జె డ్యూలెబా ఎండీ  ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీసీఎస్ తో భాధపడుతున్న స్త్రీలలో  మెటబాలిజ సమస్యలను తగ్గించేందుకు సహాయం  చేస్తుందన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement