మార్కెట్లో రిలయన్స్ మెరుపులు | Sakshi
Sakshi News home page

మార్కెట్లో రిలయన్స్ మెరుపులు

Published Mon, Sep 26 2016 1:40 PM

మార్కెట్లో  రిలయన్స్ మెరుపులు

ముంబై: అతిపెద్ద ప్రైవేటు సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)  మార్కెట్లో  దూసుకుపోతోంది. ఒక వైపు  సోమవారం నాటి ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండగా రిలయన్స్ షేర్లు  హై  వాల్యూమ్స్  తో  మెరుపులు మెరిపిస్తోంది.   గత 14 ట్రేడింగ్ సెషన్స్లో  వరుసగా 10   సెషన్స్ లో భారీ  లాభాలను నమోదు చేస్తూ ఏడు సంవత్సరాల గరిష్టాన్ని తాకింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.42 శాతం లాభాలతో   ఇంట్రాడేలో రూ.1,122 కు ఎగిసింది.   ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని  రిలయన్స్ ..టెలికాం  జియో  సేవలను  ప్రకటించిన తరువాత  నిఫ్టీ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  సెప్టెంబర్ 5  తరువాత నిఫ్టీతో పోలిస్తే రిలయన్స్11శాతం జంప్ చేయగా, నిఫ్టీ ఫ్లాట్ గా ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం ఆర్ఐఎల్ టాప్ టెన్  ప్రపంచ చమురు కంపెనీల మధ్య ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అటు   స్టాక్ మార్కెట్లు  329 పాయింట్ల భారీ  నష్టంతో, నిఫ్టీ  వంద పాయింట్లు పతనమై 88 వేల  దిగువకు పడిపోయింది.
,

Advertisement
Advertisement