గత రెండేళ్లలో ఇంత బ్లాక్ మనీనా..! | Sakshi
Sakshi News home page

గత రెండేళ్లలో ఇంత బ్లాక్ మనీనా..!

Published Tue, Jul 19 2016 7:39 PM

గత రెండేళ్లలో ఇంత బ్లాక్ మనీనా..! - Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వం గత రెండేళ్లలో రూ. 43,829 కోట్లను లెక్కలో చూపని ఆదాయంగా(బ్లాక్ మనీగా) గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక  సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. మంగళవారం రాజ్యసభకు సమర్పించిన రాతపూర్వక పత్రంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలో భాగంగా వన్ టైమ్ కంప్లీయన్స్ విండో కింద ఈ మొత్తాన్ని గత రెండేళ్లలో గుర్తించామని తెలిపారు. పన్ను చెల్లించే 990 గ్రూపుల నుంచి, 9,457 కేసుల సర్వేల ద్వారా, రూ. 43,829 కోట్లు బయపడినట్టు గంగ్వార్ పేర్కొన్నారు.

బ్లాక్ మనీ(లెక్కలోచూపని విదేశీ ఆదాయం, ఆస్తులు) అండ్ ఇంపోజిషన్ టాక్స్ యాక్ట్ 2015 కింద ఈ విండో 2015 జూలై1 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు ఓపెన్ అయి ఉందని తెలిపారు. దీని కింద గుర్తించిన మొత్తంలో రూ.2,476 కోట్లను పన్ను కింద సేకరించామని, 648 డిక్లరెంట్స్ కు పెనాల్టీలు విధించామని వెల్లడించారు.ఇన్ కమ్ డిక్లరేషన్ స్కీమ్(ఐడీఎస్) 2016 కింద నాలుగు నెలల విండోను జూన్1 నుంచి ప్రారంభించినట్టు గంగ్వార్ చెప్పారు. ఈ విండో గడువు ముగిసిన అనంతరం ఐడీఎస్ స్కీమ్ కింద గుర్తించిన బ్లాక్ మనీ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement