హిందుత్వం.. దేశానికి జాతీయ గుర్తింపు | Sakshi
Sakshi News home page

హిందుత్వం.. దేశానికి జాతీయ గుర్తింపు

Published Sun, Oct 5 2014 12:40 AM

హిందుత్వం.. దేశానికి జాతీయ గుర్తింపు - Sakshi

నాగ్‌పూర్: హిందుత్వ అనేది దేశానికి ఒక జాతీయ గుర్తింపు అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత భిన్నత్వం మధ్య కూడా దేశంలో ఏకత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. జాతీయు భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయు సంబంధాలపై ప్రధాని మోదీ చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. భాగవత్ చేసిన ఈ ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. మరోవైపు ఇది ప్రభుత్వ ప్రసార వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శించాయి.ఆర్‌ఎస్‌ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా శుక్రవారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో  భాగవత్ ప్రసంగించారు. ‘‘1925 నుంచి బలమైన, సంస్థాగతమైన, ధర్మబద్ధమైన సమాజం కోసం ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోంది. హిందుత్వ అనేది మన జాతీయ గుర్తింపు. ప్రతి గ్రామానికి, వీధికి, ప్రతి సమాజానికి, ప్రతి ఇంటికి సంఘ్ శాఖను తీసుకెళుతున్నాం. సంఘ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతుంది.
 
 

సంఘ్ ఎవరినీ ఏమీ వదిలి వేయాలని కోరదు. దేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీసే అహంకారాన్ని, గర్వాన్ని, దుర్గుణాలను వదిలివేయాలని మాత్రమే కోరుతుంది. అదే హిందుత్వ..’’ అని  పేర్కొన్నారు. జాతీయు భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయు సంబంధాలపై ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. పాలనా విధానాలను మరింత సమర్థవంతంగా కొనసాగించడానికి మోదీకి ప్రజలు మరికొంత సమయం ఇవ్వాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిం చిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి కూడా.
 
 ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు మోదీ ప్రశంస..
 
 భాగవత్ ప్రసంగంలోని పలు అంశాలను మోదీ ప్రశంసించారు. ‘ఆయన లేవనెత్తిన సామాజిక సంస్కరణలు వంటి పలు అంశాలు ప్రస్తుత పరిస్థితులను చూపుతున్నాయి..’’ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కాగా.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని కేంద్రం పేర్కొంది. ఆయన ప్రసంగానికి వార్తా ప్రావుుఖ్యం ఉందని కేంద్ర వుంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.


 భావజాల వ్యాప్తి కోసం కుట్ర..: భాగవత్ ప్రసంగం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఇది ప్రభుత్వ ప్రసార వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నాయి.  ఇది  ప్రమాదకర సంప్రదాయంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ నేత సందీప్  విమర్శించారు.ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ మరో నేత అభిషేక్‌మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. తమ హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తిచేయడం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఈ సందర్భాన్ని, ప్రత్యక్ష ప్రసారాలను వినియోగించుకుందని సీపీఎం, సీపీఐ ఆరోపించాయి. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. ఇది అధికారిక వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement