వారం రోజుల కనిష్టానికి రూపాయి | Sakshi
Sakshi News home page

వారం రోజుల కనిష్టానికి రూపాయి

Published Wed, Jan 22 2014 1:21 AM

Rupee at near two-week low on likely defence-related dollar buy

ముంబై: డాలరుతో మారకంలో రూపాయి మరోసారి నష్టపోయింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 26 పైసలు(0.4%) నష్టపోయి 61.88 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా, వరుసగా మూడో రోజు నష్టాలపాలయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం కూడా రూపాయిని బలహీనపరచిందని తెలిపారు.  క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కారణంగా తొలుత ఒక దశలో గరిష్టంగా 61.45ను తాకింది. అయితే ఆపై డాలర్లకు డిమాండ్ పెరగడంతో 61.95 వద్ద కనిష్ట స్థాయిని సైతం చవిచూసింది.

Advertisement
Advertisement