39 పైసలు కోలుకున్న రూపాయి | Sakshi
Sakshi News home page

39 పైసలు కోలుకున్న రూపాయి

Published Tue, Dec 17 2013 2:33 AM

39 పైసలు కోలుకున్న రూపాయి

 ముంబై: వరుసగా మూడు సెషన్లపాటు క్షీణించిన రూపాయి మారకం విలువ సోమవారం కాస్త కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 39 పైసలు బలపడి 61.73 వద్ద ముగిసింది. బలహీన ఆర్థిక గ ణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో దేశీ కరెన్సీకి మద్దతునిచ్చేం దుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోందన్న సంకేతాలు దీనికి కారణమని ఫారెక్స్ డీలర్లు అభిప్రాయపడ్డారు. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్.. క్రితం ముగింపు 62.12 కన్నా బలహీనంగా 62.15 వద్ద ప్రారంభమైంది. దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లపై సందిగ్ధత నెలకొనడం వంటి పరిణామాలతో రూపాయి మారకం ఒక దశలో 62.24 స్థాయికి కూడా పడిపోయింది. అయితే, ఎగుమతి సంస్థలు, కొన్ని బ్యాంకులు.. డాలర్లను విక్రయించడంతో మళ్లీ పుంజుకుని 0.63 శాతం లాభంతో 61.73 వద్ద ముగిసింది.
 
   టోకు ధరల ద్రవ్యోల్బణం   14 నెలల గరిష్టానికి ఎగిసిన గణాంకాలు, దేశీ స్టాక్ మార్కెట్ల బలహీనత వంటి అంశాలు రూపాయిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేకపోయాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. డాలర్ ఇండెక్స్ వరుసగా రెండో రోజూ బలహీనంగా ఉండటం .. రూపాయిపై సానుకూల ప్రభావం చూపిందని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమీత్ బ్రహ్మభట్ వివరించారు.

Advertisement
Advertisement