జపాన్ దెబ్బతో రూపాయి విలవిల | Sakshi
Sakshi News home page

జపాన్ దెబ్బతో రూపాయి విలవిల

Published Wed, Sep 21 2016 11:27 AM

జపాన్ దెబ్బతో రూపాయి విలవిల - Sakshi

 ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని నిర్ణయంతో దేశీయ కరెన్సీ  రూపాయి విలవిల్లాడుతోంది. జపాన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరతి సమీక్ష లో తీసుకున్న నిర్ణయంతో  దాదాపు 13 పైసల నష్టంతో భారీగా పతనమైంది.   మంగళవారం 5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి  బుధవారం కుదేలైంది.  నేడు ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్  లో డాలర్ తో  పోలిస్తే రూపాయి  67. 14 దగ్గర ట్రేడవుతోంది.  బ్యాంకులు, ఎగుమతిదారుల  అమ్మకాల వత్తిడితో ఈ పరిణామం సంభవించింది. 

మరోవైపు డాలర్ విలువ  భారీగా పుంజుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు.  కాగా  జపాన్  కేంద్ర బ్యాంకు -0.1శాతం యథాతథ నెగిటివ్ వడ్డీ రేట్ల కొనసాగింపు,  భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.   
 

 

Advertisement
Advertisement