సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై హీరోయిన్ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై హీరోయిన్ ఆగ్రహం

Published Wed, Jun 22 2016 7:04 PM

సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై హీరోయిన్ ఆగ్రహం - Sakshi

సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలను బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగన రనౌత్ తీవ్రంగా తప్పబట్టారు. సల్మాన్ తనను తాను 'అత్యాచారానికి గురైన మహిళ'తో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు భయంకరమైనవని, ఇవి చాలా మొరటు వ్యాఖ్యలని ఆమె మండిపడ్డారు.

ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన కంగన.. సల్మాన్ వ్యాఖ్యలపై స్పందించారు. సల్మాన్ 'రేప్ వుమెన్' వ్యాఖ్యలు చాలామందిలాగే తనను బాధించాయని చెప్పారు. ' ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భయంకరమైన విషయం. ఇవి చాలా మొరటైన వ్యాఖ్యలు.  కానీ ఇలాంటి విషయాల్లో ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటూ.. పరస్పరం నిందించుకోవడం, ఎదుటివారి కన్నా తామే గొప్ప అని చూపుకోవడం సరికాదు' అని కంగన పేర్కొన్నారు. 'కృతి' షార్ట్ ఫిలిం విషయమై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి  వ్యాఖ్యలు సమాజానికి తలవంపులని, ఇలాంటి వ్యాఖ్యలపై సమాజమంతా క్షమాపణ చెప్పాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement