బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన ఎస్‌బీఐ | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన ఎస్‌బీఐ

Published Sat, May 20 2017 6:20 PM

బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన ఎస్‌బీఐ

ముంబై: ప్రభుత్వ  రంగ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల  కల్పనపై  ఉసూరు మనిపించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) లో ఉద్యోగులను  తక్కువగా నియమించుకోనున్నట్టు దేశీయ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ప్రకటించింది.   ఇటీవల అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ  తెలిపింది.
 
విలీనం తర్వాత అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో  తమ ఉద్యోగుల  సంఖ్య భారీగా పెరిగిందని ఎస్‌బీఐ  చైర్‌ పర్సన్‌  అరుంధతి భట్టాచార్య  చెప్పారు . దీంతో  ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ సంఖ‍్యలో  నియామకాలు చేపటామని తాము భావించడం లేదని తెలిపారు. ముఖ్యంగా క్లరికల్‌ ఉద్యోగాల్లో నియమకాలు అసలు ఉండవని,  ఆఫీసర్‌ స్థాయి నియామకాలు ఈ సంవత్సరాంతానికి స్వల్పంగా ఉండనున్నాయని  చెప్పారు.  

ఈ ఏడాది ఏప్రిల్‌ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ బ్యాంకులు  ప్రధాన సంస్థలో విలీనమయ్యాయి.మీ విలీనం ఫలితంగా, ఎస్‌బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.


కాగా  క్యూ4లో ఎస్‌బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది.  ఎన్‌పీఏలు భారీగా తగ్గి, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్‌బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది.  
 

Advertisement
Advertisement