గోప్యత ప్రాథమిక హక్కేనా? | Sakshi
Sakshi News home page

గోప్యత ప్రాథమిక హక్కేనా?

Published Thu, Aug 24 2017 1:18 AM

గోప్యత ప్రాథమిక హక్కేనా? - Sakshi

నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్య త అసలు ప్రాథమిక హక్కేనా.. కాదా అనే విషయంపై సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువ రించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని 9 మంది న్యాయమూ ర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. మూడు వారాల్లో 6 రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగస్టు 2న తీర్పును రిజర్వు చేసింది. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్‌ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ప్రజా బాహుళ్యంలో గోప్య త వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న ధర్మాసనం పేర్కొంది.

Advertisement
Advertisement