ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Published Fri, Mar 3 2017 4:15 PM

Sensex Ends Flat; Bharti Infratel Surges 6%, Hindalco Advances 4%

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిశాయి. ఆరంభం నష్టాలనుంచి  అనూ హ్యంగా  కోలుకొని చివరికి  సెన్సెక్స్‌ ​ 7 పాయింట్ల నష్టంతో 28,832 వద్ద ,నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో  8,897 వద్ద ముగిశాయి.   పదునైన ర్యాలీతో రెండు సంవత్సరాల గరిష్టాన్ని తాకిన మార్కెట్లలో లాభాలు స్వీకరణ  శుక్రవారం కూడా కొనసాగింది .అటు ఆసియా మార్కెట్ల  బలహీనం, అమెరికాలో వడ్డీ రేటు పెంపు అంచనాలపై సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది. దీంతో ఎన్ఎస్ఇ బెంచ్మార్క్ నిఫ్టీ బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సిజి షేర్లు నష్టాలతో, ఎనర్జీ అండ్‌  మెటల్ షేర్లు లాభాలతో ముగిశాయి.

బిఎస్ఇ స్మాల్ క్యాప్ 0.4శాతం,  మిడ్‌ క్యాప్‌ 0.3శాతం లాభపడింది.ఎభారతి  ఇన్‌ ఫ్రాటెల్‌  దాదాపు 5 శాతం, హిందాల్కో  4శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది.   రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) , ఇండస్ట్రీస్, గెయిల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడగా,  బోష్,  అపోలో హాస్పిటల్స్‌,  హెచ్డిఎఫ్సి, అంబుజా సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, ఐషెర్ మోటార్స్ నష్టపోయాయి.   మరోవైపు  ధాంపూర్‌ షుగర్ మిల్స్, ప్యారీ సుగర్‌, ద్వారికేస్‌  షుగర్ ఇండస్ట్రీస్, కేసర్ ఎంటర్ప్రైజెస్ ఔధ్ షుగర్ మిల్స్, అప్పర్ గంగా చక్కెర, మవానా,  దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, కుడాచి షుగర్ వర్క్స్ లాంటి చక్కెర కంపెనీల షేర్లు  సందడి చేశాయి

 

Advertisement
Advertisement