నష్టాల్లో ముగిసిన మార్కెట్లు :మెరిసిన రిలయన్స్ | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు :మెరిసిన రిలయన్స్

Published Fri, Sep 23 2016 4:13 PM

Sensex Falls 105 Points, RIL Closes Above Rs. 1,100 After Two Years

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్105 పాయింట్ల  నష్టంతో28,668 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో8831 పాయింట్ల వద్ద  కీలక మద్దతు స్తాయికి దిగువన ముగిసింది. ఎఫ్ ఎం సీజీ, బ్యాంకింగ్ పవర్ సెక్టార్ లో  తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  మార్కెట్లను ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు దెబ్బతీశాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం పతనమైంది. కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  భారీగా నష్టపోగా యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్ గా నిలిచింది.  ఏసీసీ, లుపిన్, అంబూజా సిమెంట్స్, అరబిందో ఫార్మా,  ఇ న్ఫోసిస్ షేర్లు వెనుకబడ్డాయి.  అయితే రీట్స్‌, ఇన్విట్‌ల ఏర్పాటు నిబంధనలను  సెబీ సడలించడంతో రియల్టీ, ఇన్‌ఫ్రా షేర్లవైపు మదుపర్లుమొగ్గు చూపారు. ఈ రంగంలో కొనుగోళ్ల ధోరణి నెలకింది.కాగా   రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్ గా నిలిఇంది. దాదాపు రెండేళ్ల తరువాత   కీలక మద్దతు  స్థాయి రూ.1110  పైకి ఎగువన  స్థిరంగా ముగిసింది. దీంతోపాటు డాక్టర్‌ రెడ్డీస్, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌  లాభపడ్డాయి.  స్మాల్‌ క్యాప్స్‌లో యాడ్‌లేబ్స్‌ శ్రేయాస్‌, ఎంఈపీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, కిర్లోస్కర్‌ ఎలక్ట్రిక్‌, మెటల్‌ ఫోర్జ్‌, ఆర్తి డ్రగ్స్‌, వాల్‌చంద్‌నగర్‌, డెక్కన్‌ గోల్డ్‌, గుజరాత్ బోరోసిల్‌, రూబీ మిల్స్‌, ఆమ్టెక్‌ ఆటో, విష్ణు కెమికల్స్‌, ష్నీడర్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, లిబర్టీ షూస్‌, జిందాల్‌ సా, కాస్మో ఫిల్మ్స్‌ తదితరాలు  లాభపడ్డాయి

అటు డాలర్ తో  పోలిస్తే దేశీయ కరెన్సీ నష్టాల్లో ఉంది. 0.04  పైసల నష్టంతో 66.63 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో  పది గ్రా. పసిడి రూ. 49 నష్టంతో రూ. 31,283 వద్ద ఉంది.  
 

Advertisement
Advertisement