నష్టాల్లో మార్కెట్లు, బ్యాంకింగ్, మెటల్ డౌన్ | Sakshi
Sakshi News home page

నష్టాల్లోకి మార్కెట్లు, బ్యాంకింగ్, మెటల్ డౌన్

Published Fri, Oct 21 2016 10:13 AM

Sensex Falls Over 100 Points On Selling In Banking, Metal Shares

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ సంకేతాలూ, భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి  నేపథ్యంలో  నష్టాలలోకి మళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 87  పాయింట్ల నష్టంతో 28,029 వద్ద నిఫ్టీ 28  పాయింట్లు క్షీణించి 8,671 వద్ద ట్రేడవుతోంది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగా 87 వేల స్థాయి దగ్గర నిఫ్టీ గట్టి రెసిస్టెన్స్ ను ఎదుర్కొంటోంది.  ముఖ్యంగా బ్యాంకింగ్,  మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ లో   సెల్లింగ్  ప్రెజర్ కనిపిస్తోంది.  ఐటీ, రియల్టీ  స్వల్ప లాభాల్లో ఉన్నాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బజాజ్ ఫిన్,యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, అంబుజా, టాటా స్టీల్‌, బీవోబీ నష్టపోతుండగా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌బ్యాంక్‌ లాభపడుతున్నాయి.   
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి మరింత బలహీనపడుతోంది. 11పైసల నష్టంతో 66.92 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 3 రూపాయల లాభంతో రే.29,904 వద్ద ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement