52 వారాల టాప్ రికార్డులో నిఫ్టీ | Sakshi
Sakshi News home page

52 వారాల టాప్ రికార్డులో నిఫ్టీ

Published Mon, Jul 25 2016 4:11 PM

Sensex jumps 270 pts, Nifty up 1% to hit fresh 52-week high

బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సోమవారం ట్రేడింగ్లో రికార్డులను సృష్టించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్టంలో 8,600 మార్కును అధిగమించి, 8,635గా ట్రేడవ్వగా....సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 28,095 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్ మద్దతుతో దేశీయ సూచీలు లాభాల్లో దూసుకెళ్లినట్టు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నేషనల్ బ్యాంకు ఎక్స్చేంజ్ లో బ్యాంకింగ్ సబ్ ఇండెక్స్ 1.8శాతం పైగా లాభాలను పండించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకు 3-4శాతం మేర జంప్ అయ్యాయి.

అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకు స్టాక్స్ కొనుగోలుకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తిచూపుతుండటంతో, దేశీయ సూచీలు లాభాలను పండించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు 100 శాతం సాధారణంగా ఉన్నాయని, నదుల్లో నీటి శాతం సాధారణం కంటే 5శాతం ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. దీంతో మంచి రుతుపవనాలు ద్రవ్యోల్బణం పెరుగుదలపై నీళ్లుజల్లుతున్నాయని, వచ్చే ద్రవ్యవిధాన పాలసీలో 25 బేసిస్ పాయింట్ల కోతను ఆర్బీఐ చేపట్టవచ్చని రీసెర్చ్ సంస్థలు అంచనావేస్తున్నాయి.

అదేవిధంగా ఎనర్జీ, రియాల్టీ, కన్సూమర్ డ్యూరెబుల్స్ దాదాపు 1.5 శాతం మేర జంప్ అయ్యాయి. 13 పీఎస్యూ ఆయిల్ కంపెనీల విలీన ప్రతిపాదనను క్యాబినెట్ సెక్రటేరియట్ ఆమోదించడంతో, ఇటు ఎనర్జీ షేర్లు సైతం మార్కెట్లో ర్యాలీని కొనసాగించాయి.. అయితే కేవలం 8 స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో కిందకు దిగజారి ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మంగళవారం ప్రకటించబోయే క్యూ1 ఫలితాల నేపథ్యంలో నష్టాలను నమోదుచేస్తోంది. హిందాల్కో, బజాజ్ స్టాక్స్, యాక్సిస్ బ్యాంకులు నష్టాలను గడిస్తున్నాయి.
మార్కెట్ ర్యాలీకి   
అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.118 పాయింట్లు కోల్పోయి, రూ.30,753గా ముగిసింది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 0.19పైసలు బలహీనపడి 67.27గా ఉంది.

మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు..
1. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఆసియా మార్కెట్లు 9 ఏళ్ల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవడంతో, దేశీయ సూచీలు లాభాలను పండించాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ గ్రోత్ కు మద్దతుగా జీ-20 దేశాల పాలసీ మేకర్లు నిర్ణయాలు తీసుకోవడంతో, ఆసియా మార్కెట్లు గరిష్ట స్థాయిలో ట్రేడయ్యాయి. దీంతో దేశీయ సూచీలు ఎగబాకాయి. జూలై 26న జరగబోయే అప్ కమింగ్ యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీలో ఫెడ్ రేట్ పెంపు భయాలు వైదొలగడంతో మార్కెట్లు లాభాలను పండించాయి.  
2. ఏకీకృత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఈ వారంలోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని బలమైన సూచనలు అందడంతో మార్కెట్లు దాదాపు 300 పాయింట్లకు పైగా ఎకబాగాయి.ఎట్టి పరిస్థితిలోను ప్రభుత్వం ఈ బిల్లుపై తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, దేశీయ మార్కెట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
3. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుందనే ఆశాభావంతో ఎఫ్పీఐలు ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను విదేశీ పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో మార్కెట్లు రేజ్ అయ్యాయి.
4. 8,800 మార్కు సెంటిమెంట్ తో 8,600 కీలకమైన పాయింట్ ను నిఫ్టీ చేధించింది.

Advertisement
Advertisement