ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

Published Wed, Oct 19 2016 9:51 AM

Sensex, Nifty flat; BHEL climbs , ICICI & ITC laggards

ముంబై : గ్లోబల్ ర్యాలీతో కళకళలాడిన నిన్నటి స్టాక్మార్కెట్లు, బుధవారం ట్రేడింగ్లో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. మార్నింగ్ ట్రేడింగ్లో 50 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ , నష్టాల బాట పట్టి 28,021గా కొనసాగుతోంది. నిఫ్టీ సైతం లాభాల్లోంచి నష్టాలోకి జారుకుని 8,675గా ట్రేడ్ అవుతోంది. బీహెచ్ఈఎల్, లుపిన్, విప్రో, సన్ ఫార్మాలు లాభాల్లో నడుస్తుండగా.. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలను గడిస్తున్నాయి.
 
మంగళవారం ట్రేడింగ్లో లాభాల జోరు కొనసాగించిన ఎంపికచేసిన బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ, ఆటో స్టాక్స్లో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో మార్కెట్లు అస్థిరంగా కొనసాగుతున్నాయి. చైనీస్ జీడీపీ గణాంకాలపైనా, అమెరికా స్టాక్స్ రాత్రికి రాత్రే గడించిన భారీ లాభాలపై కూడా పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించనున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్ఫంగా బలపడి 66.68గా ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర కూడా 73 రూపాయల లాభంతో 29,778గా నమోదవుతోంది.  
 

Advertisement
Advertisement