ఊగిసలాటలో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఊగిసలాటలో మార్కెట్లు

Published Mon, Jan 30 2017 9:37 AM

ఊగిసలాటలో మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నెగిటివ్‌ నోట్‌ తో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ  ప్రతికూల సంకేతాలు, బడ్జెట్‌ అంచనాల నేపథ్యంలో స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి.  ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతుండడంతో, సెన్సె క్స్‌  22 , నిఫ్టీ 13   పాయింట్ల  నష్టంతో ఆరంభమై  మళ్లీ లాభాల బాటపట్టాయి.  19 పాయింట్ల లాభంతో   సెన్సె క్స్‌ 27,901 వద్ద, 4పాయింట్ల లాభంతో​ 8,645వద్ద ఉన్నాయి. బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్‌  దోరణిని నిర్దేశించనున్నట్లు నిపుణులు  చెప్పారు.  ముఖ్యంగా మెటల్‌ 0.6 శాతం నష్టాలు,  ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.8 శాతం చొప్పున బలపడ్డాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఐడియా 4.6 శాతం జంప్‌చేయగా.. గ్రాసిమ్‌, ఐసీఐసీఐ, ఐటీసీ, అల్ట్రాటెక్‌ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోపక్క సాఫ్ట్‌వేర్‌ బ్లూచిప్స్‌ విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లతోపాటు ఏసీసీ, హిందాల్కో 1 శాతం స్థాయిలో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

కాగా నగదు విభాగంలో దాదాపు రూ. 212 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఇక దేశీ ఫండ్స్‌  రూ. 482 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేశాయి. దీంతో మార్కెట్లు దాదాపు మూడు నెలల గరిష్టానికి చేరాయి. అమెరికా ప్రెసిడెంట్‌ కొన్ని దేశాల వీసాలపై నిషేధం విధించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డాలరు స్వల్పంగా బలహీనపడింది. దేశీయ కరెన్సీ  రూపాయి కూడా బలహీనంగా ఓపెన్‌ అయింది
 

Advertisement
Advertisement