ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు

Published Mon, Jul 25 2016 9:42 AM

Sensex, Nifty open flat; Axis slips 3%, ITC & Maruti gainers

 ముంబై:  సోమవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి.  గత వారం  ఐటీ దెబ్బతో నష్టాల్లో  ఊగిస లాడిన  సెన్సెక్స్ నిఫ్టీ ఈ వారం మొదటి రోజు  ఫ్లాట్ గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంతో 27,780 దగ్గర,నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 8536 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 85 వేల మార్క్  దిగువకు పడిపోయినా, మళ్లీ నిలదొక్కుకుని స్థిరంగా ఉంది. ఐటీసీ మారుతి షేర్లు లాభపడుతుండగా గత వారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన బ్యాంకింగ్ సెక్టార్ నష్టాల్లోఉంది. ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్  షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.  ఆసియన్  పెయింట్స్, గెయిల్ టాప్ గెయినర్స్ గా ఉండగా, ఎం అండ్ ఎం, టీసీఎస్, సిప్లా, టీసీఎస్  షేర్లునఫ్టపోతున్నాయి.

అటు కరెన్సీమార్కెట్ లో రూపాయి 0.13 పైసల నష్టంతో 67.21 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు  క్షీణించాయి. 130 రూ. నష్టంతో 10 గ్రా. బంగారం ధరం 30,857వద్ద ఉంది.

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement