స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Published Fri, Aug 19 2016 9:59 AM

Sensex, Nifty Turn Choppy Amid Selling In RIL; State Bank Leads

లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, ఎనర్జీ, ఎఫ్ఎమ్సీజీ, కన్సూమర్ డ్యూరెబుల్ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకుల బాట పట్టాయి.  సెన్సెక్స్  22.71 పాయింట్ల స్వల్ప లాభంతో 28,149 వద్ద, నిఫ్టీ 9.95 లాభంతో 8683 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతోంది. కంపెనీ షేర్లు 1 శాతం మేర డౌన్ అయ్యాయి. పవర్ గ్రిడ్, కొటక్ మహింద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల బాట పట్టాయి.

ప్రారంభ ట్రేడింగ్లో ఎస్బీఐ షేర్లు లీడింగ్లో కొనసాగాయి. భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా.. ఎస్బీఐ బోర్డు సైతం విలీనానికి ఓకే చెప్పడంతో ఆ బ్యాంకు షేర్లు లాభాల బాట పట్టాయి. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, విప్రోలు టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తున్నాయి. మరోవైపు పాజిటివ్గా ప్రారంభమైన ఆసియన్ మార్కెట్లు సైతం కొద్దిసేపటికి పడిపోయాయి. పడిపోయిన ఆసియన్ సూచీలు ప్రస్తుతం కోలుకుని లాభాల బాటలో నడుస్తున్నాయి.
అటు డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే రూపాయి విలువ 0.18 పైసలు బలహీనపడి 66.94గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 118 రూపాయల లాభంతో 31,486గా కొనసాగుతోంది.  
 

Advertisement
Advertisement