లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Fri, Sep 2 2016 9:42 AM

Sensex Pares Early Gains; Reliance Industries, Idea Cellular Drag

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.  ప్రపంచ మార్కెట్లు సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ  మార్కెట్లు  పాజిటివ్ గా   ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్‌  40 పాయింట్లు పెరిగి 28,462 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 8,780 వద్ద  ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో షేర్ల జోరు మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది.   మెటల్స్‌, ఎఫ్‌ఎంసీజీ స్వల్ప నష్టాలు, ఆటో, బ్యాంకింగ్‌, రియల్టీ, ఫార్మా రంగాలు లాభపడుతుండగా,  జియో ఎఫెక్ట్ తో టెలికాం షేర్లు నష్టాలు ఈ  రోజుకూడా కొనసాగతున్నాయి.  కోల్‌  ఇండియా, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, సిప్లా, బజాజ్‌ ఆటో, అరబిందో, భెల్‌ లాభాల్లో ఉన్నాయి. ఫెడ్ వడ్డీరేట్  సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికితోడు సోమవారం దేశీ మార్కెట్లకు సెలవుకావడంతో నేడు అంతగా యాక్టివిటీ కనిపించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అటుడాలర్ తో పోలిస్తే రూపాయి 11 పైసల లాభంతో 66.85  వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ల 10 గ్రా. పుత్తడి రూ. 57 లాభంతో రూ.30,781 వద్ద ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement