నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Fri, Apr 21 2017 3:49 PM

Sensex Reverses Gains, Nifty Below 9,150

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు మిడ్‌సెషన్‌లో ఊపందుకున్న అమ్మకాలతో  డీలా పడ్డాయి. ఒకదశలో   నిఫ్టీ 9100  కిందికి దిగజారింది.  చివరికి  సెన్సెక్స్ 57 పాయింట్లు నష్టపోయి 29,365 వద్ద, నిఫ్టీ  పాయింట్లు 17 క్షీణించి 9119 వద్ద  స్థిరపడింది.  తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,150 దిగువకు చేరింది.  ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ నష్టపోగా, రియల్టీ జోరు మాత్రం  కొనసాగింది.
సన్‌ ఫార్మా టాప్‌ లూజర్‌గా  రిలయన్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది .  ఐటీసీ 2శాతానికిపైగా నష్టపోయింది. భారతి ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ బ్యాంక్‌ఆఫ్‌ బరోడా అదానీ , సిప్లా నష్టాల్లోనూ హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌ , హెచ్‌డీఐఎల్‌, ప్రెస్టేజ్‌, యూనిటెక్‌, ఫీనిక్స్‌, ఐబీ రియల్టీ లాభాల్లోనూ    ముగిశాయి.
 

Advertisement
Advertisement