ఆఖరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి! | Sakshi
Sakshi News home page

ఆఖరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి!

Published Tue, Nov 29 2016 4:57 PM

Sensex Rises For Third Day, Nifty Settles Below 8,150

ఇంట్రాడేలో 237 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆఖరి గంటల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మంగళవారం ట్రేడింగ్లో కూడా ఫ్లాట్గా ముగిసింది. సెన్సెక్స్ 43.84 పాయింట్ల లాభంతో 26,394.01వద్ద, నిఫ్టీ 15.25 పాయింట్ల లాభంలో 8142.15 వద్ద క్లోజ్ అయ్యాయి. మారుతీ, భారతీ ఎయిర్టెల్, గెయిల్, హీరో మోటార్ కార్పొ, మహింద్రా అండ్ మహింద్రా సెన్సెక్స్లో టాప్ గెయినర్లుగా నిలువగా... ఆక్సిస్ బ్యాంకు, సన్ఫార్మా, ఎన్టీపీసీ, ఐటీసీ, టీసీఎస్లు నష్టాలను గడించాయి. బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, ఫార్మా షేర్లలో నెలకొన్న ప్రారంభ లాభాలకు చివరిలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో నిఫ్టీ 8,150 కీలకమార్కుకు దిగువనే నమోదైంది.
 
ఆటో షేర్ల మద్దతుతో నేటి ట్రేడింగ్లో మార్కెట్లు లాభాల్లో నడిచాయి.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 237 పాయింట్లు దూసుకెళ్లింది. నేటి ట్రేడింగ్లో ఇదే గరిష్ట స్థాయి. నిఫ్టీ సైతం 8,197.35 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీలో టాప్ గెయినర్గా ఐషర్ మోటార్ నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 5.34 శాతం దూసుకెళ్లి రూ.27,294 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.5 శాతం పెరిగాయి. స్థూల ఆర్థిక డేటా-జీడీపీ వెలువడనున్న నేపథ్యంతో పాటు ద్రవ్యలోటు, కోర్ రంగాలపై కూడా పెట్టుబడిదారులు ఎక్కువగా అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.  అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు లాభపడి 68.67గా నమోదైంది.  

Advertisement
Advertisement