లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Published Wed, Sep 21 2016 10:20 AM

Sensex Rises Over 100 Points After Bank of Japan Announces Fresh Stimulus

ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.  సెన్సెక్స్‌ 88 పాయింట్లు  లాభంతో  28, 611 వద్ద,  నిఫ్టీ  31 పాయింట్లు పెరిగి 8,806 వద్ద ట్రేడవుతోంది.  నిఫ్టీ 88 వేలకుఎగువకు చేరింది.  బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ రెండు రోజుల పరపతి సమీక్ష సమావేశ నిర్ణయంతో, దాదాపు అన్ని రంగాల సూచీల్లోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  ముఖ్యంగా  బ్యాంకింగ్,పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్  అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు  లాభాల్లో ఉన్నాయి. అలాగే నిన్న నష్టపోయిన ఆటో సెక్టార్   నేడు  పుంజుకుంది. మరోవైపు  ఫెడ్‌ నిర్ణయాలు  మార్కెట్ ను  ప్రభావితం చేయనున్నాయి.  

అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో  పోలిస్తే రూపాయి 0.08 పైసల నష్టంతో 67.10 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పుత్తడి 37రూపాయల నష్టంతో రూ.30,887 వద్దఉంది.
 

Advertisement
Advertisement