300 పాయింట్ల నష్టంలో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

300 పాయింట్ల నష్టంలో మార్కెట్లు

Published Wed, Aug 10 2016 2:55 PM

300 పాయింట్ల నష్టంలో మార్కెట్లు - Sakshi

ముంబై: స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు మరోసారి ఊపందుకోవడంతో దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. 275 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, నిఫ్టీ 95 పాయింట్లనష్టంతో  కొనసాగుతున్నాయి.  దీంతో ఇప్పటికే 28,000 మైలురాయి దిగువకు చేరిన సూచీ తాజాగా 27,800 స్థాయిని కూడా కోల్పోయింది. అట నిఫ్టీ కూడా బాటలో  8600 స్థాయి దిగువకు పతనమైంది.  ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాలు దెబ్బకొడుతున్నాయి.  సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే  భారీ లాభాలతో  టాటా కెమికల్స్ ఆల్ టైమ్ ని హైని తాకింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా క్యూ 1 లో రూ. 962  కోట్ల నికర  లాభాలను నమోదు చేయడంతో 3 శాతానికి పైగా  లాభ పడింది. అనంతరం  నష్టాల్లోకి జారుకుని  2.09 నష్టంతో 1,450  దగ్గర ఉంది.



అటు డాలర్తో రూపాయి మారకం విలువ  పాజిటివ్ గా ఉంది.  ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకులు  అంచనావేస్తున్నారు.

 

Advertisement
Advertisement