నష్టాలకు బ్రేక్ వేసిన స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాలకు బ్రేక్ వేసిన స్టాక్‌ మార్కెట్లు

Published Wed, Sep 28 2016 4:37 PM

Sensex Snaps 3-Day Losing Streak, Ends 69 Points Higher

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచీ లాభనష్టాలమధ్య  ఊగిసలాడిన  మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత పుంజుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 69 పాయింట్లు పెరిగి 28,293 వద్ద , నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో  8,745 వద్ద ముగిసింది.
ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆటో, మెటల్‌ రంగాల  లాభాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. మరోవైపు  గురువారం సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ధోరణి నెలకొన్నప్పటికీ,  వరుస మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేసింది.  మీడియా, మెటల్స్‌, రియల్టీ, ఆటో  సెక్టార్ లాభపడగా,  ఐటీ నష్టాలు కొనసాగాయి.  ఐషర్‌ మోటార్స్‌ 5.5 శాతం  లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది. అలాగే  హిందాల్కో, ఐడియా, టాటా స్టీల్‌, జీ, బీవోబీ, భారతీ, అదానీ పోర్ట్స్‌, బాష్‌, స్టేట్‌బ్యాంక్‌ లాభపడగా,  ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌  నష్టపోయాయి.
అటు డాలర్ పోలిస్తే రూపాయి 0.03 పైసల లాభంతో 66.46 వద్ద,  ఎంసీఎక్స్ మార్కెట్ లో పదిగ్రా. పుత్తడి 30,969 వద్ద ఉన్నాయి.

 

Advertisement
Advertisement