సర్వీస్‌ చార్జ్పై క్లారిటీ..గైడ్‌లైన్స్‌ జారీ | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ చార్జ్పై క్లారిటీ..గైడ్‌లైన్స్‌ జారీ

Published Fri, Apr 21 2017 6:36 PM

సర్వీస్‌ చార్జ్పై  క్లారిటీ..గైడ్‌లైన్స్‌ జారీ

న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్ల విధిగా సర్వీస్ చార్జి చెల్లించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.  తద్వారా  సర్వీసు బాదుడుతో ఇబ్బందులు  పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ఇక మీదటహోట‌ళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసే సర్వస్‌ చార్జ్‌ తప్పనిసరికాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  ఈ మేరకు గైడలైన్స్‌ ను  కేంద్రప్రభుత్వం  రూపొందించింది.  క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌సూల్ చేసే స‌ర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మావ‌ళిని విడుదల చేసింది.   

 రెస్టారెంట్లలో స‌ర్వీస్ ఛార్జ్ త‌ప్ప‌నిస‌రి అంశం కాద‌ని, అది వ్య‌క్త‌గ‌త‌మైన‌ద‌ని  కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్‌లో ప్రకటించారు.    సర్వీస్‌ చార్జ్‌ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్‌కు, రెస్టారెంట్లకు లేదని ట్వీట్‌ చేశారు.  క‌స్ట‌మ‌ర్లు ఎంత స‌ర్వీస్ ఛార్జ్ క‌ట్టాల‌న్న అంశాన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్లు డిసైడ్ చేయ‌రాద‌ని, అది క‌స్ట‌మ‌ర్ విజ్ఞ‌త‌కు వ‌దిలి వేయాల‌ని  వరుస ట్వీట్లలో తెలిపారు.. స‌ర్వీస్ ఛార్జ్ అంశంపై త‌యారు చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆయా రాష్ట్రాల‌కు పంపిన‌ట్లు  పాశ్వాన్‌ పేర్కొన్నారు.

కాగా సేవా రుసుంను తప్పనిసరిగా బిల్లుతో పాటు చేర్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు  దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. దీనికి హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది.  హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లుతోపాటు వాటి స్థాయిని బట్టి 5-20 శాతం సర్వీస్ చార్జి బిల్లులో కలిపి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement