సెక్స్ రాకెట్ గుట్టు రట్టు | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Published Wed, Feb 12 2014 7:53 PM

Sex racket busted in bhopal

పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ఆశిష్బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులను వారు అరెస్టు చేశారు. తమకు ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు పుష్పానగర్ ప్రాంతంలోని ఒక ఇంటిపై దాడి చేశారు.

అక్కడ వ్యభిచారం చేస్తున్న వారందరినీ వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న మగవాళ్లంతా యువకులేనని మహిళా పోలీసు స్టేషన్ ఇన్చార్జి రేణు మురబ్ తెలిపారు. వ్యభిచారం చేస్తూ దొరికిన మహిళల్లో పశ్చిమ బెంగాల్, భోపాల్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు ఆమె చెప్పారు.

Advertisement
Advertisement