అక్కడ అన్నీ షేర్‌ చేసుకోవచ్చు | Sakshi
Sakshi News home page

అక్కడ అన్నీ షేర్‌ చేసుకోవచ్చు

Published Sat, Aug 12 2017 1:38 PM

sharing culture spreading across china

కార్లు, బైక్‌ల నుంచి ఏ వస్తువు కావాలన్నా షేరింగ్‌ పద్ధతిలో వాడుకోవడం రొటీన్‌గా మారనుంది. షేరింగ్‌ కల్చర్‌ ప్రస్తుతం చైనాను ఊపేస్తున్నది. స్మార్ట్‌ ఫోన్‌లో ఓ చిన్న క్లిక్‌తో అక్కడ సర్వం సమకూరుతున్నాయి. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు ఈ తరహా కంపెనీలకు నిధులు సమకూరుస్తుండటంతో ఏకంగా బీఎండబ్ల్యూ కార్లూ చిటికెలో కస్టమర్ల ముందు వాలుతున్నాయి. షెన్యాంగ్‌ నగరంలో ఓ కంపెనీ రాయల్‌ బ్లూ బీఎండబ్ల్యూలను షేరింగ్‌ కోసం సిద్ధం చేస్తున్నది. 999 యువాన్లు డిపాజిట్‌ చేయడంతో పాటు కిలోమీటర్‌కు 1.5 యువాన్ల రెంటల్‌ ఫీజు చెల్లిస్తే కళ్లుచెదిరే లగ్జరీ వాహనాలు క్లయింట్ల కోసం రెడీ అవుతున్నాయి.

ఇక బైక్‌లు, ట్రెడ్‌మిల్స్‌, లగ్జరీ హ్యాండ్‌ బ్యాంగ్‌లు సైతం షేరింగ్‌ పద్ధతిన జనాలకు చేరువవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తిని తక్కువ ఖర్చులో మోజు తీరేవరకూ వాడుకునేందుకు షేరింగ్‌ కల్చర్‌ అందుబాటులోకి తెచ్చిందని చైనీయులు సంబరపడుతున్నారు. మరోవైపు లగ్జరీ బ్రాండ్లను వాడే సంపన్నులు సైతం తమ అవసరాలు తీరిన తర్వాత ఆయా వస్తువులను పక్కనపడేయకుండా కొద్దిరోజులు రెంట్‌కు ఇస్తే రాబడీ ఉంటుందని భావిస్తున్నారు. షేరింగ్‌కు అనర్హమైనవేవీ లేవంటూ చివరికి ఎలక్ర్టిక్‌ స్కూటర్లు, ఫోన్‌ ఛార్జర్లు, వర్క్‌ స్పేస్‌లు, గొడుగులు, బాస్కెట్‌ బాల్స్‌ కూడా షేరింగ్‌లో అందుబాటులో ఉన్నాయి.
 

Advertisement
Advertisement