ఫ్రాన్స్ షాపింగ్ మాల్‌లో దుండగుల కలకలం | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ షాపింగ్ మాల్‌లో దుండగుల కలకలం

Published Tue, Jul 14 2015 2:11 AM

ఫ్రాన్స్ షాపింగ్ మాల్‌లో దుండగుల కలకలం

విలెనూవ్ లా గరెన్నీ(ఫ్రాన్స్): పారిస్ సమీపంలోని ఒక షాపింగ్‌మాల్‌లో మరోసారి కలకలం రేగింది. తుపాకులతో వచ్చిన ముగ్గురు సోమవారం ఉదయం 6.30 ప్రాంతంలో ప్రిమార్క్ మాల్‌లో జొరబడ్డారు. మాల్‌లో పనిచేసే ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చిన మెసేజ్‌తో అప్రమత్తమైన ఫ్రెంచ్ ప్రత్యేక దళాలు ఆ మాల్ నుంచి 18 మంది సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు. దుండగులు దోపిడి చేయడానికే వచ్చారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

మరో 18 మంది ఉద్యోగులు మాల్‌లోనే ఉండిపోయారని  తెలిపారు. అయితే దుండగులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైనా.. వాళ్లు బయటకు వెళ్లినట్లు మాత్రం వాటిల్లో నమోదవలేదు. కాసేపటి తర్వాత దుండగులు మాల్ నుంచి పారిపోయారు. జనవరిలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పారిస్‌లో ఒక షాపింగ్ మాల్ వద్ద 17 మందిని కాల్చి చంపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలెనూవ్ లా గరెన్నీ ప్రాంతంలో ఎలాంటి దాడినైనా ప్రతిఘటించేందుకు ఏడు వేల మంది జవాన్లను  మోహరించారు.
 

Advertisement
Advertisement