పంజాబ్లో మళ్లీ ఆందోళనలు | Sakshi
Sakshi News home page

పంజాబ్లో మళ్లీ ఆందోళనలు

Published Sun, Oct 18 2015 12:26 PM

పంజాబ్లో మళ్లీ ఆందోళనలు

చండీగఢ్: పంజాబ్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమ మతగురువు గురు గ్రంథ్ సాహిబ్ను ఉద్దేశ పూర్వకంగా మరో సిక్కు వర్గం అవమానించిందని పేర్కొంటూ మరోసారి ఆదివారం కొందరు సిక్కు ఆందోళన కారులు మాల్వాలో పలు రహదారులు దిగ్భందించారు. రాకపోకలకు ఇబ్బందులు సృష్టించారు. అయితే, అంతకుముందు జరిగినన్నీ ప్రాంతాల్లో కాకుండా తక్కువ ప్రాంతాల్లో ఆదివారం ఆందోళలు మొదలయ్యాయి. నిరసన ప్లకార్డులు, నల్లజెండాలు, దిష్టి బొమ్మలతో పలువురు సిక్కు ఆందోళనకారులు మాల్వా, ఫరిద్ కోట్, భటిండా ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చారు.

అయితే, తాము ఎలాంటి ఆందోళనలు, హింసను సృష్టించబోమని కేవలం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే నిరసనలు తెలుపుతామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పడంతో పోలీసులు కాస్త నెమ్మదించారు.తమ గురువును అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.తమ మత గురువును కించపరిచారనే ఆగ్రహంతో కొందరు సిక్కులు అవతలి వర్గం వారికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించగా అది హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement