భారీ భూకంపం.. చిన్న సునామీ | Sakshi
Sakshi News home page

భారీ భూకంపం.. చిన్న సునామీ

Published Tue, May 5 2015 12:29 PM

భారీ భూకంపం.. చిన్న సునామీ

సిడ్నీ: పుపువా న్యూగినియా తీరంలో భారీ భూకంప సంభవించగా.. దానివల్ల మాత్రం చిన్న సునామీ వచ్చింది. భూకంప కేంద్రం సమీపంలో ఒక మీటర్ ఎత్తు (మూడు అడుగులు) సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. వీటిని రాబౌల్ లోని హార్బర్ వద్ద గుర్తించారు. పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

దక్షిణ పసిఫిక్  ద్వీపం న్యూ గినియాలో కొకొపో పట్టణానికి దక్షిణాదిన 139 కిలో మీటర్ల దూరంలో 60 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు కూడా. దీనివల్ల తీరంలోని నివాసాల గోడలు బీటలువారగా.. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.

Advertisement
Advertisement