పోలీసుల వద్ద లొంగిపోయిన సోమ్నాథ్ భారతి | Sakshi
Sakshi News home page

పోలీసుల వద్ద లొంగిపోయిన సోమ్నాథ్ భారతి

Published Tue, Sep 29 2015 3:21 AM

Somnath bharti surrendered late night

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌భారతికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలతో ఆయన భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాల్సిందిగా సోమ్‌నాథ్ భారతి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేయటంతో ఆయన సుప్రీం తలుపులు తట్టడం  తెలిసిందే. సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సోమవారం సాయంత్రంలోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.  బెయిలుపై విచారణ కావాలంటే గురువారం కోర్టుకు రావొచ్చంది. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సోమ్‌నాథ్ ప్రవర్తించాలని ధర్మాసనం తెలిపింది.

వారం రోజులుగా అజ్ఞాతనంలో ఉన్న సోమ్‌నాథ్ దారులన్నీ మూసుకుపోవడంతో సోమవారం రాత్రి 10 గంటలకు ద్వారకా నార్త్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. తాను చట్టం నుంచి తప్పించుకు తిరగడం లేదని, రాజ్యాంగమిచ్చిన న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement