మాయావతి ర్యాలీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట! | Sakshi
Sakshi News home page

మాయావతి ర్యాలీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట!

Published Sun, Oct 9 2016 3:30 PM

మాయావతి ర్యాలీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట!

లక్నో: దాదాపు 5లక్షల మంది ప్రజలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలో తలపెట్టిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం లక్నోలోని కాన్షీరాం సమరక్‌ స్థల్‌ వద్ద చేపట్టిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగి.. ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలు విడిచారు. 13మందికి గాయాలయ్యాయి.

గేట్‌ నంబర్‌ 1 నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో ఒకేసారి వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటు ముందుకువెళ్లడంతో కొందరు కిండపడిపోయారు. వారిని తొక్కుకుంటూ ఇతరులు ముందుకువెళ్లిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) స్థాపకుడు కాన్షీరాం పదో వర్ధంతి సందర్భంగా మాయావతి ఈ భారీ ర్యాలీని ఏర్పాటుచేశారు. ఈ ర్యాలీకి ప్రజలు పెద్దసంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అంటున్నారు. మరోవైపు మృతుల్లో ఒక వృద్ధ మహిళ తొక్కిసలాట వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్ల ప్రాణాలు విడిచిందని బీఎస్పీ యూపీ చీఫ్‌ రామాచల్‌ రాజ్‌భర్‌ తెలిపారు.

Advertisement
Advertisement