స్టేషన్ బెయిల్ విధానం రద్దు | Sakshi
Sakshi News home page

స్టేషన్ బెయిల్ విధానం రద్దు

Published Tue, Sep 8 2015 3:56 PM

station bail cancelled by union government

న్యూఢిల్లీ: ఇకమీదట ప్రతి చిన్న కేసులో కూడా బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే. స్టేషన్ బెయిల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. స్టేషన్ బెయిల్ విధానంతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు బెయిల్ ఇచ్చే అధికారులు ఉన్నాయి. అయితే స్టేషన్ హౌజ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో కేంద్రం దృష్టిసారించింది. సీఆర్పీసీ 41 (ఏ)కు  చట్టంలో కేంద్ర న్యాయశాఖ సవరణలు చేసింది. దీని ప్రకారం ఇక నుంచి బెయిల్ రావాలంటే కోర్టును ఆశ్రయించాల్సిందే. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తప్పనిసరిగా కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement