స్టాక్స్ వ్యూ | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Nov 7 2016 1:30 AM

స్టాక్స్ వ్యూ

 టెక్ మహీంద్రా కొనొచ్చు
 బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్
 ప్రస్తుత ధర: రూ.430  టార్గెట్ ధర: రూ.520

 
 ఎందుకంటే: టెక్ మహీంద్రా ఆదాయం డాలర్ల పరంగా 4 శాతం, రూపారుుల్లో 5 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన) వృద్ధి చెందింది. వివిధ సంస్థల కొనుగోళ్ల కారణంగా కంపెనీ ఈ క్యూ2లో మంచి వృద్ధిని సాధించింది. పునర్వ్యస్ఠీకరణ వ్యయాల కారణంగా మార్జిన్లు మాత్రం ఫ్లాట్‌గా 16శాతంగా ఉన్నాయి. ఇతర ఆదాయం భారీగా తగ్గడంతో నికర లాభం 17 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 14 శాతం) క్షీణించింది. ఈ క్యూ2లో 32 కోట్ల డాలర్ల విలువైన మూడు పెద్ద డీల్స్‌ను కంపెనీ సాధించింది.  
 
 డీల్స్ విషయమై క్లయింట్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ కారణంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న కమ్యూనికేషన్‌‌సవిభాగం రికవరీ సాధించగలదని యాజమాన్యం ఆశిస్తోంది. అలాగే ఎంటర్‌ప్రెజైస్ విభాగం కూడా నిలకడైన వృద్ధిని సాధించగలదని కంపెనీ భావిస్తోంది. కమ్యూనికేషన్‌‌స విభాగంలో కంపెనీల కొనుగోళ్లకారణంగా ఈ విభాగం మంచి వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఎంటర్‌ప్రెజైస్ విభాగంలో కొనసాగుతున్న వృద్ధి, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగాల్లో వృద్ధి, వ్యయ నియంత్రణ పద్ధతులు, అనుబంధ సంస్థల పనితీరు మెరుగుపడడం తదితర కారణాల వల్ల మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నారుు.
 
  ఇటీవల కాలంలో ఈ షేర్‌కొంత కరెక్షన్‌కు గురై ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలోనే లభిస్తోందని భావిస్తున్నాం. కమ్యూనికేషన్ విభాగంలో జోరు కారణంగా టెలికం రంగంలో తన అగ్రస్థానాన్ని కంపెనీ కొనసాగించవచ్చు. డిజిటల్ విభాగంలో కంపెనీ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలాలు త్వరలో అందనున్నాయి. మార్జిన్లు మెరుగుపడడం, కంపెనీ కొనుగోలు చేసిన సంస్థల పనితీరు కూడా మెరుగుపడడం వంటి కారణాల వల్ల దీర్ఘకాలంలో కంపెనీ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం. కరెన్సీ ఒడిదుడుకులు, టెలికం విభాగానికి సంబంధించిన డీల్స్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశాలుండడం ప్రతికూలాంశాలు.
 
 మారుతీ సుజుకీ కొనొచ్చు
 బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
 ప్రస్తుత ధర: రూ.5,715  టార్గెట్ ధర: రూ.6,765

 
 ఎందుకంటే: భారత కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఇది. 2013-14లో 42 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 47 శాతానికి పెరిగింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.17,843 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 218 బేసిస్‌పారుుంట్లు పెరిగి 17 శాతానికి చేరాయి.
 
 ప్రతికూలమైన కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ముడి పదార్ధాల వ్యయాలు 40 బేసిస్ పాయింట్లు పెరిగినప్పటికీ, నికర లాభం 60 శాతం వృద్ధితో రూ.2,398 కోట్లకు పెరిగింది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, వర్షాలు విస్తారంగా కురియడం, ఏడవ వేతన సంఘం సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం, జీఎస్‌టీ అమలు కారణంగా కార్ల వ్యయాలు 4-5 శాతం వరకూ తగ్గే అవకాశాలుండడం,.. వివిధ మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లను అందించనుండడం,
 
 స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా అందుబాటులోకి తేనుండడం, డిమాండ్ పెరుగుతుండటంతో డిస్కౌంట్ల భారం తగ్గనుండడం, గుజరాత్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే, (ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం కావచ్చు) లాజిస్టిక్స్‌వ్యయాలు తగ్గే అవకాశాలుండడం... ఇవన్నీ కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు.  కార్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎగుమతులు మాత్రం ఫ్లాట్‌గా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.  రెండేళ్లలో ఆదాయం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.308 ఉంటుందని అంచనాలతో ఏడాది కాలంలో ఈ షేర్ రూ.6,765కు చేరగలదని అంచనా వేస్తున్నాం.

 గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement