బాలిక డ్రెస్‌ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ! | Sakshi
Sakshi News home page

బాలిక డ్రెస్‌ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ!

Published Mon, May 1 2017 6:46 PM

బాలిక డ్రెస్‌ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ!

మలేషియాలో 12 ఏళ్ల చెస్‌ చాంపియన్‌కు చేదు అనుభవం ఎదురైంది.  ఆ బాలిక మోకాళ్ల వరకు ఉన్న దుస్తులు వేసుకున్నప్పటికీ ఆమె డ్రెస్‌ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ.. జాతీయ యువజన టోర్నమెంటులో ఆడనివ్వలేదని ఆమె కోచ్‌ వెల్లడించారు.  మలేషియాలో గత నెల 14-16 తేదీల మధ్య జాతీయ పాఠశాల స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది. అయితే, ఈ పోటీలలో పాల్గొనేందుకు తన విద్యార్థిని పాల్గొంటుండగా.. తను దుస్తులు సరైనవిధంగా లేదంటూ టోర్నమెంటు డైరెక్టర్‌ మధ్యలోనే ఆమెను టోర్నమెంటు నుంచి గెంటేశారని, దీంతో తన విద్యార్థిని తీవ్ర ఆవేదనకు గురైందని కోచ్‌ కౌషల్‌ ఖందర్‌ చెప్పారు.

చెస్‌ టోర్నమెంటులో డ్రెస్‌ కోడ్‌ ఉండటం మామూలు విషయమే. ఆటగాళ్లు హుందాగా పోటీలలో పాల్గొనేందుకు వీలుగా స్థానిక నిర్వాహకులకు ఇలాంటి నిబంధనలు విధించే అవకాశం ప్రపంచ చెస్‌ సమాఖ్య అయిన ఎఫ్‌ఐడీఈ కల్పిస్తుంది. అయితే, ఇరాన్‌ వంటి దేశాల్లోనే ఇలాంటి డ్రెస్‌కోడ్‌ అమలవుతుంది. మలేషియా ఇస్లామిక్‌ దేశమైన అక్కడ బహిరంగ ప్రదేశాల్లో స్కర్ట్స్‌, షార్ట్స్‌ వేసుకోవడం సర్వసాధారణం. అయితే,  మొదటిరౌండులో తన విద్యార్థిని వేసుకున్న డ్రెస్‌ మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ రెండోరౌండ్‌లో ఆమె బాగా ఆడుతున్న సమయంలోనే ఇలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను ఆడకుండా చేశారని, ఇలా వ్యవహరించడం దారుణమని కోచ్‌ కౌషల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement