పరీక్షల్లో జవాబులుగా పాటలు, బూతులు రాశారు! | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో జవాబులుగా పాటలు, బూతులు రాశారు!

Published Sun, Apr 30 2017 10:13 AM

పరీక్షల్లో జవాబులుగా పాటలు, బూతులు రాశారు! - Sakshi

కోల్‌కతా: సెమిస్టర్‌ పరీక్షల్లో సమాధానాలకు బదులు పాటలు, కవితలు, బూతులు రాసిన పదిమంది విద్యార్థులపై పశ్చిమబెంగాల్‌లో వేటుపడింది. మాల్దాలోని బల్గర్‌ఘాట్‌ లా కాలేజీకి చెందిన విద్యార్థులను రెండేళ్లపాటు విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది. గత ఏడాది జరిగిన మూడో సెమిస్టర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు పదిమంది ఈ విధంగా తప్పుడు పద్ధతిని అనుసరించారని, వారు జవాబుపత్రాల్లో దూషణలు, హిందీ, బెంగాలీ సినిమాల్లోని పాటలు, ప్రేమగురించిన అంశాలు రాశారని, నిజనిర్ధారణకమిటీ వీటిని గుర్తించడంతో సదరు విద్యార్థులపై రెండేళ్ల సస్పెన్షన్‌ వేటు వేసినట్టు బెంగాల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (అడిషనల్‌ చార్జ్‌) సనాతన్‌ దాస్‌ తెలిపారు.

గత ఏడాది జరిగిన ఈ పరీక్షల్లో 150మంది హాజరవ్వగా, 40మంది మాత్రమే పాసయ్యారు. దీంతో తమను పాస్‌ చేయలేదని సదరు విద్యార్థులు విధ్వంసానికి, హింసకు దిగారని, తప్పుడు జవాబులు రాయడమే కాకుండా తీవ్ర అభ్యంతరకరంగా వ్యవహరించడంతో వారిపై రెండేళ్ల సస్పెన్షన్‌ విధించాలని కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

Advertisement
Advertisement