సన్‌ఫార్మా లాభాలు నామమాత్రం | Sakshi
Sakshi News home page

సన్‌ఫార్మా లాభాలు నామమాత్రం

Published Tue, Feb 14 2017 7:24 PM

Sun Pharma Q3 profit falls 5% to Rs 1472 cr on higher tax cost

ముంబై: దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ  సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను  ప్రకటించింది.  అమెరికా మరియు భారతీయ మార్కెట్లలో అమ్మకాలు నెమ్మదించడంతో థర్డ్‌ క్వార్టర్‌ లో లాభాలు  నామామాత్రంగా నమోదు చేసింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 5 శాతం నికర లాభాలు క్షీణించి రూ.1472 కోట్లను ప్రకటించింది.  అంతకు ముందు సంవత్సరంలో రూ.1545 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం8 శాతం  పెరిగి 7683 కోట్లకు చేరింది.  నిర్వహణ లాభం(ఇబిటా) 9 శాతం పుంజుకుని రూ. 2,453 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 31.5 శాతం నుంచి  31 శాతానికి బలహీనపడ్డాయి.  పన్ను వయ్యాలు రూ. 59 కోట్ల నుంచి రూ. 373 కోట్లకు పెరిగాయి.
 

Advertisement
Advertisement