తెలంగాణ, ఏపీలకు సుప్రీం నోటీసులు | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీలకు సుప్రీం నోటీసులు

Published Fri, Aug 29 2014 12:41 PM

తెలంగాణ, ఏపీలకు సుప్రీం నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. మహారాష్ట్ర పిటిషన్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వినాల్సివుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

కృష్ణా జలాల పంపిణీపై గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జరుగుతున్న విచారణలో తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని ఇంప్లీడ్ పిటిషన్‌ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం నీటి కేటాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement