Sakshi News home page

ప్రకటనల వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం నోటీసు

Published Tue, Aug 18 2015 2:18 AM

Supreme Court notice to Centre on advertising affair

న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల తీరుపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీసు ఇచ్చింది. ఈ ప్రకటనలను నియంత్రించడానికి తాము చెప్పినట్లు ముగ్గురు సభ్యుల అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేశారో, లేదో తెలపాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనల్లో నేతల ఫొటోలుండొద్దన్న కోర్టు ఆదేశాలను ఢిల్లీలోని ఆప్ సర్కారు, తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉల్లంఘించాయంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాల కేంద్రం (సీపీఐఎల్) పిటిషన్ వేయడంతో ఈ నోటీసు ఇచ్చింది.

ఈ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ ఫొటోలు తప్ప మరే నేత ఫొటోలు వాడొద్దని సుప్రీం గతంలో చెప్పింది. తమ నోటీసుపై నాలుగు వారాల్లో సమాధానం తెలపాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్.వీ.రమణలతో కూడిన సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. సీపీఐఎల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ విషయాన్ని కోర్టే చూసుకుంటుందని స్పష్టంచేసింది.
 

Advertisement
Advertisement