భారతీయ దంపతులకు మాత్రమే.... | Sakshi
Sakshi News home page

భారతీయ దంపతులకు మాత్రమే....

Published Wed, Oct 28 2015 4:28 PM

భారతీయ దంపతులకు మాత్రమే.... - Sakshi

న్యూఢిల్లీ: సరోగసిని భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. 'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. ఇండియాలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.

కమర్షియల్ సరోగసి కోసం అండం దిగుమతి చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.  అలాగే అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు తెలిపింది. 

సరోగసి విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలను పంపినట్టు వెల్లడించింది. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు సమగ్ర చట్టం తేవాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయపడింది.కాగా, దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 24కు వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement